ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈసీకి లేఖ రాశాం: అచ్చెన్నాయుడు - achenna naidu news

ఎంపీ విజయసాయిరెడ్డి తెదేపా నేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పురపాలక ఎన్నికల్లో.. కార్పొరేటర్ అభ్యర్థులను వైకాపా నేతలు భయపెట్టి.. ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

achenna
అచ్చెన్నాయుడు

By

Published : Feb 25, 2021, 7:20 AM IST

పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విశాఖలో మేయర్‌ అభ్యర్థి ఎంపిక, కార్పొరేటర్‌ అభ్యర్థుల పేర్ల ఖరారుపై బుధవారం ఆయన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘విశాఖలో ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉండటంతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యర్థులను భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కొంతమందితో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. అభ్యర్థే వచ్చి ఉపసంహరించుకుంటేనే ఆమోదం తెలపాలి. దీనిపైనా ఈసీకి లేఖ రాశాం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details