ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు. కరోనా వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన బోధనా, బోధనేతర సిబ్బందికి రూ.10 వేల భృతిని ప్రత్యేక ప్యాకేజీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వడ్డీలేని రుణం ఇప్పించటంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని కోరారు. విద్యా సంస్థలు నడవక, జీతాలు అందక సుమారు 25 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయినా.. సీఎం మనస్సు కరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం తగదు : అచ్చెన్న - వైకాపా ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు వ్యాఖ్య
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కరోనా దెబ్బకు ఉపాధ్యాయులు కార్మికులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు.
achenna letter to cm jagan to help private teachers