ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఐటీ విడుదల చేసిన పత్రాలే వైకాపాకు చెంపపెట్టు'

తెదేపాకు అవినీతి రంగును పులమాలని చూస్తే...వైకాపా నేతలకు శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుందని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఐటీ సోదాలపై అధికారులు విడుదల చేసిన పంచనామా పత్రాలు.. వైకాపాకు చెంపపెట్టని ట్వీట్ చేశారు.

Achenaidu tweet On_Bosa
'ఐటీ విడుదల చేసిన పత్రాలే వైకాపాకు చెంపపెట్టు'

By

Published : Feb 17, 2020, 4:37 AM IST

అచ్చెన్నాయుడు ట్వీట్​

ఐటీ సోదాలపై అబద్ధాలు ప్రచారం చేసిన వైకాపా నాయకులు, వారి అవినీతి మీడియాని చూస్తుంటే ఏదో సామెత గుర్తొస్తోందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికేసిందని గగ్గోలు పెట్టిన వాళ్లందరికీ ఐటీ అధికారులు విడుదల చేసిన పంచనామా పత్రాలు చెంపపెట్టని దుయ్యబట్టారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు... ఇన్నాళ్లూ 2 వేల కోట్లంటూ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మంత్రి బొత్స ఆవేశం చూసి మైకులకు సైతం పూనకం వచ్చిందని ధ్వజమెత్తారు. కానీ చివరికి ఆయాసమే మిగిలిందన్నారు. వైకాపా నాయకుల అవినీతి రంగును తెలుగుదేశానికి వేద్దామనుకుంటే చివరికి మిగిలేది కృష్ణ జన్మస్థానమేనని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details