రాష్ట్ర మంత్రులపై తెదేపా నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో సీఎం జగన్ మెప్పు కోసం మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు విరుద్ధంగా.. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తక్కువ గడువుతో నోటిఫికేషన్ ఇచ్చారని..ఇలా ఇష్టానుసారంగా తేదీలను నిర్ణయించి జీవోలు ఇచ్చారని అన్నారు. ఆ రోజు మంచోడిలా కనిపించిన రమేశ్ కుమార్.. ఎన్నికలను వాయిదా వేస్తే కులం పేరుతో విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉండదని సీఎస్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
'మీకు నచ్చకపోతే కులాన్ని అంటగడుతారా?' - ఏపీలో ఎన్నికలు వాయిదా
సీఎం జగన్ మెప్పు కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలను వాయిదా వేస్తే కులం పేరుతో విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
achenaidu comments on ministers