ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా కష్టకాలంలోనూ జగన్‌ కాసులు దండుకుంటున్నారు' - తెదేపా నేత అచ్చెన్నాయుడు తాజా వార్తలు

కరోనా కష్టకాలంలోనూ జగన్‌ కాసులు దండుకుంటున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్​లో ర్యాపిడ్ కిట్లు ఒక్కోటి రూ.337 లని.. ఏపీలో ర్యాపిడ్ కిట్లు ఒక్కోటి రూ.817 ఉందన్నారు. కిట్ల కొనుగోళ్లలో ఏకంగా రూ.8కోట్లు దండుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

achanaidu-
achanaidu-

By

Published : Apr 20, 2020, 6:10 PM IST

ముఖ్యమంత్రి జగన్‌...కరోనా కష్టకాలంలోనూ కాసులు దండుకుంటున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్​లో ర్యాపిడ్ కిట్లు ఒక్కోటి 337రూపాయలు ఉంటే, ఏపీలో 817 రూపాయలు ఉందని మండిపడ్డారు. ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలో కరోనా టెస్టింగ్ కిట్లలో కూడా వాటాలు దండుకోవడం సిగ్గు చేటన్నారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో ఏకంగా రూ.8 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. హాట్ స్పాట్​లున్న ప్రాంతాల్లో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉందన్న ఆయన.. కరోనా పరీక్షల విషయంలో, పరీక్షా కిట్ల విషయంలో దోచుకోవడం ఏంటని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details