ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడి కత్తి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు - సీఎం జగన్​పై దాడి

కోడి కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్​ దాఖలు చేశాడు. 21నెలలుగా జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నానని పేర్కొన్నాడు. బెయిల్ ఇస్తే...కోర్టు షరతులకు లోబడి ఉంటానని తెలిపాడు.

attack on Jagan Mohan Reddy case
attack on Jagan Mohan Reddy case

By

Published : Sep 6, 2020, 3:35 AM IST

విశాఖ విమానాశ్రయంలో జగన్​పై కోడి కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు... బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ... కరోనా నేపథ్యంలో విచారణపై అనిశ్చితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 21 నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నానని తెలిపాడు. వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని, బెయిల్‌ ఇప్పిస్తే కోర్టు షరతులకు లోబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. బెయిల్‌ ఇవ్వకపోతే కనీసం 15 రోజుల్లో ఎన్​ఐఏ కోర్టులో ముఖ్యమంత్రి జగన్‌ సాక్ష్యం చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరాడు.

ABOUT THE AUTHOR

...view details