మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన 70 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా కేసులో ఐదుగురు నిందితులను ఇందోర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వేద్ ప్రకాశ్ వ్యాస్‌ను నగరానికి తీసుకువచ్చారు. అతని ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.
13న హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్స్ కేసు నిందితుడు - ఎండీఎంఏ డ్రగ్స్ కేసు
ఇటీవలే మధ్యప్రదేశ్‌లో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ వాసి వేద్‌ప్రకాశ్ వ్యాస్‌ను ఇందోర్ పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. నిందితుని ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈనెల 13న వ్యాస్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈనెల 13న వ్యాస్‌ను కోర్టులో హాజరుపరుస్తామని ఇందోర్ పోలీసులు తెలిపారు. ఈ నిందితునికి నగరంలో ఓ ఇల్లు, ఫ్యాక్టరీ ఉన్నట్లు గుర్తించామని, అక్కడే అతను డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే తనిఖీలు నిర్వహించేందుకు నిందితుణ్ని నగరానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
మరో ముగ్గురు నిందితులు దినేశ్ అగర్వాల్, చిమన్ అగర్వాల్, అక్షయ్ అగర్వాల్‌లు మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో టెంట్‌హౌస్ ముసుగులో మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారని వెల్లడించారు. ఈ కేసుతో పలువురు వ్యాపారులు, ప్రముఖులకు సంబంధమున్నట్లు దర్యాప్తులో తేలిందని ఇందోర్ పోలీసులు చెప్పారు. వారిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి :'ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు!'