ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలగపూడి ఎస్సీ మహిళ కేసులో పురోగతి...ఏడుగురు అరెస్ట్ - sc women death case latest news

వెలగపూడి ఘటనలో మృతి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.

Accused arrested in Velagapudi SC woman death case
వెలగపూడి ఎస్సీ మహిళ మృతి కేసులో నిందితుల అరెస్ట్

By

Published : Jan 6, 2021, 7:43 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఎస్సీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో ప్రాణాలు కోల్పోయిన మరియమ్మ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వెలగపూడి ఎస్సీ కాలనీకి చెందిన ఏడుగుర్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించారు. మరియమ్మ కేసులో కోడూరు మోహనరావు, సలివేంద్రం నవీన్, సలివేంద్రం రత్నం, కోడూరు నరేంద్ర, కోడూరు కిరణ్, సలివేంద్రం అబ్రహం, సలివేంద్రం సజ్జనారావులను అరెస్టు చేశారు.

ఎస్సీలోని రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతోందని జిల్లా క్రైం ఏఎస్పీ ఎన్వీఎస్ మూర్తి చెప్పారు. మృతిరాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని...అందులో ప్రధాన నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details