ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ - సికిింద్రాబాద్​ నగరాల్లో తగ్గిన రోడ్డు ప్రమాదాలు - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్-సికింద్రాబాద్​ జంటనగరాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో మొత్తం 40 శాతం పైగా మరణాలు తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

road accidents decreased
తగ్గిన రోడ్డు ప్రమాదాలు

By

Published : Nov 5, 2020, 11:23 AM IST

హైదరాబాద్-సికింద్రాబాద్​ జంటనగరాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో మొత్తం 40 శాతం పైగా మరణాలు తగ్గినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరు వరకు హైదరాబాద్‌లో 1,909 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా.. ఈ ఏడాది 1,153 మంది చనిపోయారు.

50 ప్రమాద ప్రాంతాల్లో...

రహదారులపై గుంతలు, మరమ్మతులు, విభాగినులు, బారికేడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. నగరంలో 50 ప్రమాద ప్రాంతాలను గుర్తించి సూచికలను ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్‌ స్ట్రిప్స్‌ను రోడ్లపై అమర్చారు. ఎఫ్​ఐఆర్​లను సేకరించి ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తున్నారు.

తగ్గిన ప్రమాదాలు...

ఈ ఏడాది అక్టోబరు 31 వరకు హైదరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన 1,421 ప్రమాదాల్లో 1,464 మంది గాయపడగా 184 మంది చనిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన 2,241 ప్రమాదాల్లో 2,464 మంది గాయపడగా 522 మంది బలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన 1,712 ప్రమాదాల్లో 1,791 గాయాలుకాగా... 447 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చదవండి

ప్రయాణికులతో రద్దీగా మారుతున్న బస్టాండ్‌లు

ABOUT THE AUTHOR

...view details