ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిద్రమత్తులో ఎక్స్​లేటర్ తొక్కిన లారీ డ్రైవర్..ఇద్దరికి గాయాలు - News today Nizamabad Lorry accident

నిద్ర మత్తులో లారీని నడుపుతున్న డ్రైవర్ బ్రేక్​కు బదులుగా ఎక్స్ లేటర్​ను తొక్కడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టోల్​ ప్లాజాలోని మూడు కార్లు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి. ఘటనతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

నిద్రమత్తలో ఎక్స్​లేటర్ తొక్కిన లారీ డ్రైవర్..ఇద్దరికి గాయాలు
నిద్రమత్తలో ఎక్స్​లేటర్ తొక్కిన లారీ డ్రైవర్..ఇద్దరికి గాయాలు

By

Published : Sep 14, 2020, 12:39 AM IST

నిద్రమత్తులో ఎక్స్​లేటర్ తొక్కిన లారీ డ్రైవర్..ఇద్దరికి గాయాలు

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఓ లారీ విధ్వంసం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బ్రేక్ బదులుగా ఎక్స్​లెటర్ తొక్కడంతో టోల్​ప్లాజాలోని ఐదో నెంబర్​ వద్ద వేచి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.

ఉలిక్కిపడ్డ వాహనదారులు..

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో టోల్ ఫ్లాజా సిబ్బందితో పాటు వాహనదారులు ఉలిక్కిపడ్డారు. ఘటనతో వరుసలో ఉన్న మూడు కార్లు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి. వేగంగా సిమెంట్ దిమ్మను ఢీకొని లారీ నిలిచిపోయింది.

ఇద్దరికి స్వల్ప గాయాలు..

ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని టోల్ ప్లాజా పీఆర్ఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే పూర్తి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి

'సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి'

ABOUT THE AUTHOR

...view details