ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jerks in flight: విమానంలో 20 నిమిషాలు టెన్షన్.. చివరికి..! - హైదరాబాద్ విమానం

తెలంగాణలోని హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం.. కాసేపు ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టించింది. తమిళనాడులోని తిరుచ్చి వెళ్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది.

flight
flight

By

Published : Mar 20, 2022, 4:32 AM IST

తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని తిరుచ్చి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఆకస్మాత్తుగా కుదుపులకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కుదుపుల ధాటికి విమానంలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.

20 నిమిషాల పాటు టెన్షన్

విమానం దాదాపు 20 నిమిషాలపాటు కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపులు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైలట్‌ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విమానం గమ్యానికి సురక్షితంగా చేరుకోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయిచే ఆకాశం మేఘావృతమై ఉండడం వల్లే ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: BJP on YSRCP: 'అప్పులు చేసి ఎంత కాలం పాలిస్తారు ?'.. వైకాపా సర్కార్​పై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details