లాక్డౌన్ వేళ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాకతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
నిర్మల్ మండలం కొండాపూర్ వద్ద ప్రమాదం
నిర్మల్ మండలం కొండాపూర్ వద్ద ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి సుమారు 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు. ప్రమాద సమయంలో లారీలో 60 మంది కూలీలు ఉన్నారు.