ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బీసీలకు రిజర్వేషన్లలో ప్రభుత్వం వైఫల్యం' - బీసీ రిజర్వేషన్లపై మాట్లాడిన అచ్చెన్నాయుడు

బలహీనవర్గాల పట్ల నాడు రాజశేఖర్​రెడ్డి, నేడు జగన్మోహన్​రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉన్నారనే అక్కసుతో వైకాపా నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు.

acchennaidu on bc reservations
అచ్చెన్నాయుడు

By

Published : Mar 2, 2020, 8:00 PM IST

అచ్చెన్నాయుడు

పాదయాత్రలో జగన్ మాయమాటలు చెప్తే బలహీన వర్గాల్లో చీలిక వచ్చి వైకాపాకు ఓటు వేశారని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. 9 నెలల పాలనలో బలహీన వర్గాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు ఎంతో లబ్ధి చేకూర్చే చంద్రన్న బీమా, పెళ్లికానుక వంటి పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 2013లో సుప్రీంకోర్టు 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. తాను అనుకున్నది చేయాలనుకునేందుకు 5కోట్ల రూపాయలతో న్యాయవాదిని పెట్టిన జగన్.. బీసీ రిజర్వేషన్ విషయంలో ఎందుకలా చేయడం లేదని నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details