Recruitment Process: 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. నియామక ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి.. త్వరగా చేపట్టే బాధ్యతను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. ఖాళీల సమాచారంపై ఇప్పటికే ఆర్థికశాఖ ఆయా శాఖలతో సంప్రదింపులు జరిపింది. హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం.. సోమవారం సమావేశమై నియామక ప్రక్రియ పురోగతిని సమీక్షించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సీఎం ప్రకటన అనంతరం ఇప్పటివరకు జరిగిన పురోగతిని మంత్రులు సమీక్షించారు. కొన్ని శాఖలు, కొన్ని పోస్టుల భర్తీ కోసం.. తమ వద్దకు ప్రతిపాదనలు వచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. అన్నింటినీ పరిశీలించి పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు.
రెండురోజుల్లో ఉత్తర్వులు...