హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అధికారులు ఆరాా తీస్తున్నారు. పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే అనిశా అధికారులు దాడులు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్పందించిన సొసైటీ కార్యదర్శి..
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అనిశా తనిఖీలపై.. సొసైటీ కార్యదర్శి స్పందించారు. తమ సొసైటీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలు పారదర్శకంగా జరుగుతున్నాయని.. తొలిసారి అనిశా సోదాలు జరిగినట్లు చెప్పారు. రికార్డులు అనిశా అధికారులకు చూపించినట్లు తెలిపారు. ఖాతాలన్నీ ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సొసైటీ సావేశాలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నడూ హాజరుకాలేదని కార్యదర్శి వెల్లడించారు.