ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ACB Raids in hyderabad: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజిలెన్స్​ మాజీ డీఎస్పీ జగన్ అరెస్ట్ - హెచ్​ఎండీఏ మాజీ డీఎస్పీ

ACB Raids on EX DSP: హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో అనిశా సోదాలు నిర్వహించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దాడులు చేసింది. విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ బంధువుల ఇళ్లలోనూ అనిశా తనిఖీలు చేసి.. జగన్​ను అరెస్ట్ చేశారు.

ACB Raids on EX DSP
ACB Raids on EX DSP

By

Published : Dec 15, 2021, 12:11 PM IST

ACB Raids on EX DSP: అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్​ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్​ హబ్సిగూడలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతనిని అరెస్ట్ చేశారు. జగన్​తో పాటు అతని సెక్యూరిటీ గార్డు రామును సైతం అరెస్ట్ చేశారు.

HMDA EX DSP: హెచ్​ఎండీఏకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు చేశారు. జగన్ నివాసంలో ఇంటికి సంబంధించిన పత్రాలతో పాటు 56 తులాల బంగారం గుర్తించారు. జగన్ బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి జగన్ ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో వెంచర్‌ వేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. బినామీ పేరుతో డీఎస్పీ జగన్ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details