ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈఎస్‌ఐ కుంభకోణంలో ఉద్యోగుల పాత్రపై అనిశా ఆరా - ఈఎస్​ఐ స్కామ్ వార్తలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల్ని ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ (అనిశా) సిద్ధమవుతోంది. టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థకు టోల్‌ఫ్రీ, ఈసీజీ సేవల కాంట్రాక్టు అప్పగింతతో పాటు ఔషధాలు, వైద్య పరికరాలు, సర్జికల్‌ వస్తువులు, ల్యాబ్‌ కిట్‌లు, ఫర్నిచర్‌ కొనుగోలుకు సంబంధించి ఇన్సూరెన్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ నుంచి వెళ్లిన దస్త్రాల్ని సచివాలయంలోని ఆయా విభాగాల్లో ఎలా ఆమోదించారు..? అనే అంశంపై దర్యాప్తు చేస్తోంది.

esi scam
esi scam

By

Published : Jun 15, 2020, 7:07 AM IST

ఈఎస్​ఐ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల్ని ప్రశ్నించేందుకు అనిశా సిద్ధమవుతోంది. 2014 - 19 మధ్య ఐఎంఎస్‌ డైరెక్టర్లుగా పనిచేసిన వారు ఆర్థికశాఖ అనుమతి, బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డరు లేకుండా.. వర్క్‌ ఆర్డర్లు, కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు అనిశా తేల్చింది. ఈ వ్యవహారంలో కొంతమంది సచివాలయ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో ఓపెన్‌ టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దానిని పాటించలేదని అనిశా గుర్తించింది. ఈ వ్యవహారంలో సచివాలయ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తోంది.

డీఐఎంఎస్‌ నుంచి వచ్చిన దస్త్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిసినప్పటికీ ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది? అనే కోణంలో వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. మొత్తం 19 మంది ప్రమేయాన్ని గుర్తించారు. అరెస్టైన వారిలో కొంతమందిని విచారించేందుకు వీలుగా అనిశా సోమవారం కస్టడీ పిటిషన్లు దాఖలు చేయనుంది.

ఇదీ చదవండి :ఆనంద గజపతిరాజు వారసులం మేమే

ABOUT THE AUTHOR

...view details