ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటుకు నోటు కేసు: విచారణ వాయిదా వేయాలన్న రేవంత్ పిటిషన్ కొట్టివేత - ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

ఓటుకు నోటు కేసుపై అనిశా కోర్టులో విచారణ జరిగింది. విచారణ వాయిదా వేయాలన్న రేవంత్ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

revanth reddy
ఎంపీ రేవంత్ రెడ్డి

By

Published : Mar 15, 2021, 9:18 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేయాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్​ను అనిశా న్యాయస్థానం తోసిపుచ్చింది. పార్లమెంటు సమావేశాలకు హాజరు కావల్సి ఉన్నందున విచారణ ప్రక్రియను వాయిదా వేయాలన్న రేవంత్​ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది.

రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది హాజరైనా.. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయవచ్చునన్న అనిశా వాదనతో కోర్టు ఏకీభవించింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు న్యాయమూర్తి సెలవులో ఉండనున్నందున కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details