తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌పై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈటల తమ భూములు కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు.
ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని నిన్న సీఎంకు రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై సమగ్ర విచారణకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ పాల్గొన్నారు. అచ్చంపేటలో ఈ మేరకు భూములు అధికారులు సర్వే చేస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలో భూముల సర్వే కొనసాగుతోంది.