ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2022, 6:58 PM IST

ETV Bharat / city

'పోలీసులు కావాలనే ఇరికించారు.. నాకు బెయిల్​ ఇప్పించండి'

Subbarao bail petition: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​ విధ్వసం కేసులో నిందితుడైన ఆవుల సుబ్బారావు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు తనను కావాలనే అల్లర్ల కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసులో ఆవుల సుబ్బారావు ఏ64గా ఉన్నారు.

subbarao bail petition
సుబ్బారావు బెయిల్‌ పిటిషన్‌

subbarao bail petition: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న ఆవుల సుబ్బారావు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సైన్యంలో భర్తీ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఆగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో విధ్వంసం సృష్టించారు. ఈరోజు జరిగిన అల్లర్లలో తన పాత్ర లేదని నిందితుడు పిటిషన్​లో పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఆర్మీలో పనిచేసిన తాను.... యువతను సైన్యంలో చేరేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సుబ్బారావు పిటిషన్​లో తెలిపారు. ఈ కేసులో సుబ్బారావును పోలీసులు ఏ64గా పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం సుబ్బారావుతో పాటు అతని అనుచరులు శివ, మల్లారెడ్డి, బీసీ రెడ్డిలను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. విధ్వంసం కేసులో సుబ్బారావు ప్రధాన కుట్రదారని పోలీసులు ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు. ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్​గా పనిచేసిన సుబ్బారావు... 2011 పదవీ విరమణ పొందాడని... 2014లో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి... ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావాలనుకునే యువతకు శిక్షణ ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలన్నీ నష్టపోతాయనే దురుద్దేశంతోనే.. సుబ్బారావు, యువకులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో విధ్వంసం చేయించాడని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన తర్వాత కోర్టు పోలీసులకు నోటీసులు ఇవ్వనుంది. పోలీసుల తరఫు న్యాయవాది... ఆవుల సుబ్బారావు పాత్రపై తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details