ఆరోగ్యశ్రీ సేవలు విస్తరణ..పోస్టర్ ఆవిష్కరించిన సీఎం - latest news of AAROGYA SRI in Andhrapradesh
ఆరోగ్య శ్రీ ద్వారా పొందే సేవలను విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పొందే సేవలను విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపచేసే పోస్టర్‌ను సీఎం జగన్ ఇవాళ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందనున్నాయి.130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం ప్రారంభించారు. తాజా నిర్ణయంతో 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని 716 వైద్య సేవలను రోగులు పొందే అవకాశం ఉంది.