ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోన్ అతిగా వాడద్దన్న తల్లి... మనస్థాపంతో ఉరేసుకున్న యువతి - రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది.

student death in telangana
ఫోన్ అతిగా వాడద్దన్న తల్లి... మనస్తాపంతో ఉరేసుకున్న యువతి

By

Published : Mar 25, 2021, 7:52 PM IST

ఫోన్ అతిగా మాట్లాడొద్దని తల్లి మందలించడంపై.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది పామేనా గ్రామానికి చెందిన సుప్రియా (19) మొయినాబాద్‌లోని ఓ కళశాలలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది.

బుధవారం మధ్యాహ్నం.. కూతురు ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన తల్లి.. ఆమెను మందలించింది. అప్పుడప్పుడు కాస్త చదువు మీద కూడ శ్రద్ధ పెట్టాలని సూచించింది. మనస్థాపానికి గురైన సుప్రియ.. గదిలోకి వెళ్లి చీరతో ఫ్యానుకు ఉరేసుకుంది. కూతురి మరణంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details