A young man was murdered in Bollaram a suburb of Hyderabad: హైదరాబాద్ నగర శివారు ఐడీఏ బొల్లారంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని ఎక్కడో హత్య చేసి ఐడీఏ బొల్లారం ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో మృతదేహాన్ని పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రింగురోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దారుణహత్య.. కాళ్లూ చేతులు కట్టేసి.. ఊహించలేం అసలు? - బొల్లారంలో యువకుడి హత్య
A young man was murdered in Bollaram: కాళ్లు, చేతులు కట్టేసి తెలంగాణలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని ఎక్కడో హత్య చేసి ఐడీఏ బొల్లారం ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
![యువకుడి దారుణహత్య.. కాళ్లూ చేతులు కట్టేసి.. ఊహించలేం అసలు? murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16636427-290-16636427-1665669884618.jpg)
murder
గురువారం తెల్లవారుజామున యువకుడి హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. క్లూస్ టీంను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నామని ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువకుడి వయసు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది.
Murder
ఇవీ చదవండి: