తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. లారీ కింద ఇరుక్కుపోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను సురక్షితంగా బయటపడటానికి సుమారుగా 45 నిమిషాల సమయం పట్టింది. జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చౌరస్తా ప్రధాన రహదారిపై లారీ.. రివర్స్ గేర్‌లో కిరాణా షాపులకు వస్తువులు డంపు చేస్తోంది. ఆ సమయంలో స్థానికంగా నివసించే మైబుస్ లారీ వెనుక వైపు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు టైర్ కింద పడిపోయాడు. వెంటనే డ్రైవర్ బ్రేక్ వేసినా.. అప్పటికే మైబుసు కాలు టైర్ మధ్యభాగంలో ఇరుక్కుపోవడంతో బాధితుతడు ఆర్తనాదాలు చేశాడు.
తెలంగాణ: లారీ చక్రాల మధ్య ఇరుకున్న యువకుడు - A young man stuck in the middle of the lorry wheels
ప్రమాదవశాత్తు లారీ చక్రాల మధ్యలో ఓ యువకుడు ఇరుక్కుపోయాడు. దాదాపు 45 నిమిషాలు స్థానికులు శ్రమించిన అనంతరం అతను సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణ : లారీ చక్రాల మధ్య ఇరుకున్న యువకుడు
డ్రైవర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక దశలో జేసీబీతో యత్నించినా కాపాడలేకపోయారు. చివరికి స్థానికులు చాకచక్యంగా బాధితుడిని రక్షించగలిగారు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:corona effect: కర్ఫ్యూ ఆంక్షల వల్ల నష్టాల్లో ఆక్వా రైతులు