ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MILKMAN MURDER : మిత్రుడే హంతకుడు.. అందుకే చంపేశాడట.. - యువకుడి దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా స్నేహితుడే అంతమొందించాడు. వారం రోజుల తర్వాత గుట్టు రట్టైంది. పోలీసులు కాల్​డేటా కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది.

MILKMAN MURDER
స్నేహితుడే చంపాడు...ఎందుకో తెలుసాా..?

By

Published : Oct 7, 2021, 9:48 AM IST

Updated : Oct 7, 2021, 10:17 AM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో దారుణ హత్య జరిగింది. ఖైత్లాపూర్​లో పాలవ్యాపారం చేసుకునే శ్రీకాంత్​(26)ను అతని స్నేహితుడే చంపేశాడు. ఈనెల 1నుంచి శ్రీకాంత్ కనిపించట్లేదని అతని కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాల్​డేటా ఆధారంగా..

పలు విధాలుగా కేసు దర్యాప్తు కొనసాగించిన పోలీసులకు.. కాల్​డేటాలో అసలు విషయం చిక్కింది. మృతుడి కాల్​డేటాను కూడా పరిశీలించడంతో.. ఓ మహిళతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ మహిళ ఎవరని ఆరాతీయగా.. శ్రీకాంత్​ మిత్రుడు శ్రీశైలం భార్యగా తేలింది. అంతేకాకుండా.. శ్రీకాంత్​ చివరిసారిగా శ్రీశైలంతోనే కనిపించినట్టు తేలడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. శ్రీశైలం నేరాన్ని అంగీకరించాడు.

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడిని హత్య చేసినట్టుగా.. నిందితుడు శ్రీశైలం నేరాన్ని అంగీకరించినట్టు కూకట్​పల్లి సీఐ నర్సింగ్​రావు తెలిపారు. ఈనెల 1న ఐడీఎల్​ కంపెనీ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, హత్య చేసినట్లు శ్రీశైలం చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:Honey Trap: బావ.. మరదలు.. ప్రియుడు.. మధ్యలో ఓ సుబ్బు.. వలపు వలతో కోటి కాజేశారు!

Last Updated : Oct 7, 2021, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details