Youngman Suicide in Sircilla: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన యువకుడు అక్కడి నుంచి బయటకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
చికిత్స కోసం వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. - చికిత్స కోసం వచ్చి యువకుడు ఆత్మహత్య
Youngman Suicide in Sircilla : చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట వాసి పరశురాం(24) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రోజున చికిత్స కోసం సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. దవాఖానా నుంచి బయటకు వచ్చిన పరశురాం అర్ధరాత్రి సమయంలో.. అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి బలవన్మరణంపై ఆరా తీశారు. అతడి ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి :