SELFIE SUICIDE: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయిన యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం మలక్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. మలక్‌పేటకు చెందిన రామకృష్ణ అనే యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఈ వ్యసనంతో సుమారు రూ.6 లక్షలకు పైగా అప్పు చేసి నష్టపోయాడు. దీంతో వాటిని తీర్చలేక, ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వాళ్ల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మరణించాడు. చేతికి అందివచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Video Viral: తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి - young man committed suicide by taking selfie video
SELFIE SUICIDE: ఏ ఆటైనా సరే.. ఎప్పుడో ఓసారి ఆడితే కాలక్షేపం.. అప్పుడప్పుడు ఆడితే అలవాటు.. ఎప్పుడూ అదే పనిగా ఆడుతున్నామంటే అది వ్యసనం. ఇలా ఆటలపై ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనాలతో ఎంతోమంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆపై ఆ అప్పులు ఎలా తీర్చాలో పాలుపోక.. బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
online