ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Loan App Harassment: లోన్​ యాప్​ వేధింపులు.. హైదరాబాద్​లో యువకుడు బలి - loan app harassment

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఆన్​లైన్​ యాప్​ వేధింపులు ఆగడం లేదు. లోన్​ యాప్​ నిర్వాహకుల వేధింపులు తాళలేక తాజాగా హైదరాబాద్​లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాకీలో కొంత చెల్లించినా మిగతా నగదు సైతం చెల్లించాలని... రిఫరెన్స్​ ఇచ్చిన ఫ్రెండ్స్​కు ఫోన్లు చేయడంలో మనస్తాపానికి గురై యువకుడు ఉరేసుకున్నాడు.

1
1

By

Published : Apr 19, 2022, 1:35 PM IST

Loan App Harassment : ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు. జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌.. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ద్వారా 12వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే లోన్‌ రిఫరెన్స్‌ కింద స్నేహితుల ఫోన్‌ నెంబర్లను సైతం వారికి ఇచ్చాడు. తీసుకున్న రుణంలో ఈఎంఐ ద్వారా 4వేల రూపాయలు చెల్లించాడు.

మిగతా బాకీ చెల్లించలేదంటూ.. లోన్‌ రిఫరెన్స్‌ కింద ఇచ్చిన స్నేహితుల ఫోన్‌ నంబర్లకు నిర్వాహకులు మెసేజ్‌లు పంపించారు. మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుల్సుంపుర పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రాజ్‌కుమార్‌

ABOUT THE AUTHOR

...view details