తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 5.5 కిలోల బరువుతో బాల భీముడు జన్మించాడు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండకు చెందిన అభినయకు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాన్పు చేశారు. కాన్పులో ఆమెకు 5.5 కిలోలు బరువుతో మగ శిశువు జన్మించాడు.
సాధారణంగా అప్పుడే పుట్టున శిశువులు రెండు నుంచి మూడు కిలోల బరువుతో ఉంటారు. కానీ 5.5 కిలోలతో జన్మించడం అరుదని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో నవజాత శిశువు కేంద్రంలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.