Woman Cheats: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో డాలికీ డోలీ సినిమా తరహా ఉదంతం వెలుగు చూసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో వారి అందరికీ స్వీట్ చేసి.. దానిలో మత్తుమందు కలుపుతుంది. అందరూ తిన్న తర్వాత ఆ ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చోటు చేసుకుంది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది.
వ్రతం కూడా చేసి..
40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. దీంతో సంబంధాలు ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే కుదిరిస్తానని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడితో కలిసి మధ్యవర్తితో కలిసి బెజవాడ వెళ్లిన అతను అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు.