woman caught thief in Rangareddy: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష, నగేష్ దంపతులు హయత్‌నగర్ బొమ్మలగుడి సమీపంలోని బాలాజీనగర్ రోడ్డు నెంబర్ 6లోని ప్లాట్‌నెంబర్ 182/5లో భిక్షమయ్య అనే వ్యక్తి ఇంటి మొదటి అంతస్తులో రెండునెలలుగా అద్దెకుంటున్నారు. పక్కనే మరో రెండు సింగిల్ బెడ్‌రూమ్‌లు ఖాళీగా ఉండడంతో ఇంటి యజమాని ఫోన్‌నెంబర్ సహా రాసిన టూ-లెట్ బోర్డును పెట్టాడు. అయితే ఇటీవల భిక్షమయ్య దంపతులు మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడి వద్దకు వెళ్లారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సరాసరి ఇంటి పైఅంతస్తుకు చేరుకొని అద్దెకు ఇళ్లు కావాలంటూ శిరీషను అడగడంతో యజమాని లేడంటూ బదులిచ్చింది. అయితే తాను ఫోన్ చేశానని ఇల్లు చూపించాలని చెప్పాడని అతను నమ్మకంగా చెప్పడంతో.. తొలుత ఒక ఫ్లాట్‌ను తర్వాత మరో ఫ్లాట్ చూపించి తాళం వేస్తుండగానే సదరు దొంగ అప్పటికే తనవెంట తెచ్చుకున్న కారాన్ని ఆమె కళ్లలో కొట్టి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగులు తీశాడు.