ట్యూషన్ టీచర్ ఓ బాలుని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. హోంవర్క్ సరిగా చేయడంలేదని చితకబాదింది. బాలునికి ఒళ్లంతా వాతలు పడడంతో బాలుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది.
కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడడం వల్ల బాపూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన 8ఏళ్ల కుమారుడిని వెంగళరావునగర్‌లో ఉంటున్న విజయలక్ష్మి వద్ద ట్యూషన్‌కు పంపుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు హోంవర్క్ సరిగా చేయకపోవడంతో ఆమె... బాలుడిని చితకబాదింది. కుమారుడి ఒంటిపై దెబ్బలను చూసిన బాలుడి తండ్రి.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.