కరోనా వైరస్ బారిన పడి కల్లోలంగా మారిన చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్ల బృందం చిక్కుకోవటం కలకలం రేపుతోంది. శ్రీసిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా స్టార్ ఆప్టో ఎలక్ర్టానిక్స్ టెక్నాలజీ(సీఎస్ఓటీ) సంస్థ ఇంజినీర్ల బృందాన్ని శిక్షణ కోసం గతేడాది చైనాకు పంపించింది. చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది ఆగస్టులో 93మంది విద్యార్థులు శిక్షణకు వెళ్లగా...వారిలో 45మంది ఇంజినీర్లు శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వుహాన్ నగరం కరోనా కోరల్లో చిక్కుకోవటంతో...అక్కడ ఉండిపోయిన ఇంజినీర్ల బృందాన్ని తిరిగి రప్పించేందకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వారిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాగా....తిరుపతి కి చెందిన విష్ణుప్రియ అనే ఇంజినీర్ తండ్రి మీడియా తో మాట్లాడారు. తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం ఆచారి....ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమార్తె సహా ఇంజినీర్ల బృందాన్ని తిరిగి రప్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి తమ కుమార్తె ఆరోగ్యం బాగానే ఉందని...ఫోన్ లో అందుబాటులో ఉందని చెబుతోన్న ఆమె తండ్రి....అక్కడి పరిస్థితులు విషమంగా మారుతున్న తరుణంలో వీలైనంత త్వరగా తమ పిల్లలను రప్పించాలని కోరుతున్నారు. ఈమేరకు సీఎం జగన్ సహా ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.
'వుహాన్ నుంచి మా పిల్లలను త్వరగా రప్పించండి' - latest updates of karona virus news
కరోనా వైరస్ బారిన పడి కల్లోలంగా మారిన చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్ల బృందం చిక్కుకోవటం కలకలం రేపుతోంది. అక్కడి పరిస్థితులు విషమంగా మారుతున్న తరుణంలో వీలైనంత త్వరగా తమ పిల్లలను రప్పించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
a-team-of-telugu-engineers-trapped-in-ohan-city-china