ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే.. బుద్ది లేని పని చేశాడు

Teacher Rape On Student: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువు, తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగు చూసింది.

Teacher Rape On Student
విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అత్యాాచారం

By

Published : Sep 24, 2022, 4:47 PM IST

Updated : Sep 24, 2022, 5:47 PM IST

Teacher Rape On Student: విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే బుద్దిహీనంగా ప్రవర్తించాడు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కామంతో రగిలిపోయాడు. అభం శుభం తెలియని 10వ తరగతి బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి.. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిట్టి తల్లి గర్భం దాల్చింది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట మండలంలో వెలుగు చూసింది. ఓ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 10వ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పిచ్చయ్య విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ఆ బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బాలికకు వైద్యపరీక్షలు చేయడంతో గర్భవతి అని నిర్ధారణ అయింది. దీంతో తల్లిందండ్రులు ఆ బాలికను నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వారికి చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు దమ్మపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గర్బవతిని చేసిన కీచక గురువును వెంటనే విధుల నుంచి తొలగించి , శిక్షించాలని మహిళా సంఘాలు, గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఆది నుంచీ అభ్యంతరాలు..: మరోవైపు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులు విధులు నిర్వహించడంపై ఆది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే కారణాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ అశ్వారావుపేట మండలంలోని ఒక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఘటనతోనైనా అధికారులు మేల్కొని బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 24, 2022, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details