విద్యార్థులే తన పిల్లలుగా భావించి వివాహం కూడా చేసుకోకుండా విద్యార్థులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి శిష్యుడు మరపురాని కానుక అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెంకటరెడ్డి పాతికేళ్లుగా ఒప్పంద అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. వందల మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించారని విద్యార్థులు చెబుతున్నారు. ఆయన వద్ద చదువుకుని విదేశాల్లో స్థిరపడిన సూర్యరామచంద్రారెడ్డి అనే పూర్వ విద్యార్థి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పెన్సిల్ తో ఆయన చిత్రాన్ని గీసి కానుకగా ఇచ్చాడు.
గురువుపై ప్రేమను ఆ విద్యార్థి ఇలా చాటుకున్నాడు..! - ఉపాధ్యాయుల దినోత్సవం
మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. తల్లిదండ్రులు, గురువు దేవుడితో సమానమని వీటి అర్థం. వీరికి సమాజంలో ఎనలేని స్థానం ఉందని ఇవి తెలియజేస్తున్నాయి. అలాంటి గురువుకు ఓ శిష్యుడు...పెన్సిల్తో గీసిన చిత్రాన్ని ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.
a student give