తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ప్రకృతి మంచుదుప్పటి కప్పుకుంది. నేరడ శివారు అటవీ ప్రాంతంలో మంచు బిందువులతో నిండి ఉన్న ఓ సాలెగూడు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి భూగోళం పటంలా కనిపిస్తోన్న ఈ మంచు ముత్యాల సాలెగూడు.. ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కింది. అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ఈ గూడు.. ఓ దారం ఆధారంగా వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దారం కూడా సాలె పురుగు అల్లినదే కావడం గమనార్హం.
తెలంగాణ: మంచు బిందువులతో నిండిన సాలెగూడు - మంచు ముత్యాల సాలెగూడు
చలికాలంలో మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ గ్రామంలో.. పచ్చని మొక్కలపై హిమజల్లులతో పాటు నీటి బిందువులతో గూడు కట్టుకుందా..! అనేలా ఉన్న సాలెగూడులు చూపరులను కట్టిపడేసేలా ఉన్నాయి.
సాలెగూడు