Survey on Schemes: సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోడానికి వాలంటీర్లతో రాష్ట్రంలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం రూపొందించిన యాప్.. వాలంటీర్ల మొబైల్ ఫోనులో అప్‌లోడ్ చేసేలా ఆదేశాలు వెలువడ్డాయి. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు తమ పరిధిలోని వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి యాప్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలి, లబ్ధిదారుల అభిప్రాయాలు మొబైల్‌లో చిత్రీకరించి ఎలా అప్‌లోడ్ చేయాలో వివరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో గురువారం నుంచే సర్వే ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్నందున.. శుక్ర, శనివారాల్లో సర్వే ప్రారంభించే యోచనతో ఉన్నారు.
Survey on Schemes: పథకాలపై ప్రజల అభిప్రాయం?.. సర్వేకు ప్రత్యేక యాప్ - పథకాలపై అభిప్రాయాల సేకరణ
Survey on Schemes: సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది... లబ్ధిదారులు ఏమంటున్నారు... అసలు పథకాలు అర్హులకు అందుతున్నాయా..? పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు ఏంటి..? అనే విషయాలను తెలుసుకోవడానికి వాలంటీర్లతో రాష్ట్రంలో సర్వే నిర్వహించనున్నారు. అయితే ఈ సర్వే కోసం ఓ యాప్‌ను రూపొందించారు. దీనిని వాలంటీర్ల ఫోన్లలో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
పథకాలపై ప్రజల అభిప్రాయం