ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా మృతుడిని ముద్దు పెట్టుకున్నసామాజిక సేవకుడు - మృతదేహం

కరోనా ఎందరో ఆత్మీయులను దూరం చేస్తోంది. అయినవారిని అందనంత దూరానికి తీసుకెళ్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి సమయంలో కరోనాతో పోరాడి మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు ముద్దు పెట్టుకున్నారు. మృతదేహం నుంచి వైరస్ వ్యాపించదని అవగాహన కోసమే ఇలా చేశానని చెబుతున్నారు. ఈ సంఘటన తెలంగాణ ఖమ్మం జిల్లాకేంద్రంలో జరిగింది.

corona
కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్నసామాజిక సేవకుడు

By

Published : May 17, 2021, 10:48 PM IST

కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్నసామాజిక సేవకుడు

కరోనాతో మృతిచెందిన వారిని చూస్తేనే అంత్యక్రియలకు సైతం జంకుతున్న వారిని చూశాం. తీరా బంధువులు, ఆత్మీయులు కూడా దగ్గరికి వచ్చేందుకే భయపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ తెలంగాణ ఖమ్మం జిల్లాకేంద్రంలో విచిత్ర సంఘటన జరిగింది. కరోనాతో పోరాడి మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు ముద్దు పెట్టుకున్నారు

ఈ విధంగా వైరస్ వ్యాపించదని అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానని అంటున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఈ విధంగా చేశాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బంధువులు దగ్గరకు వచ్చేందుకు భయపడుతున్నా.. ఆయన మాత్రం మృతదేహాన్ని కౌగిలించుకున్నారు. రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి సుమారు వందల మృతదేహాలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details