ప్రమాదంలో గాయాల పాలైన ఓ శునకం పట్ల ఓ గ్రామీణ వైద్యుడు చూపిన కరుణ ఆ శునకానికి కొత్త నడకను ఇచ్చింది. రెండు కాళ్లను కోల్పోయిన వీధి శునకం ఇప్పుడు రెండు కాళ్లు, రెండు చక్రాలతో సులువుగా నడవగలుగుతోంది.
తెలంగాణ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు షేక్ ఆషా కొద్ది రోజుల క్రితం తన నివాసానికి దగ్గర్లో ఓ వీధి శునకానికి నడుము, కాళ్లు విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. దాన్ని చేరదీసి ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే చక్రాల బండికి మార్పులు చేర్పులు చేసి శునకం నడుముకు ఇలా అమర్చారు. ఇప్పుడా శునకం ఓ జత కాళ్లు, జత చక్రాలతో పరుగందుకుంటోంది. ఇది చూసిన వారు ఔరా..! ఇలా కూడా చేయొచ్చా అనుకోకమానరు.