Hyderabad Metro Latest News: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. నిన్న ఒక్కరోజులోనే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ పేర్కొంది. మియాపూర్- ఎల్బీ నగర్ కారిడార్‌లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.
నిమజ్జనం వేళ నిండిన మెట్రో రైళ్లు.. రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య - వినాయక నిమజ్జనం
Hyderabad Metro Latest News: గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం మెట్రో రైళ్ల సమయం పొడిగించడంతో రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. అత్యధికంగా మియాపూర్, ఎల్బీ నగర్ కారిడార్‌లో ప్రయాణికులు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో
గణేశ్ నిమిజ్జనం నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు అధిక సంఖ్యలో మెట్రోను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్లో 62 వేల ఫుట్‌ఫాల్ నమోదైంది. ఖైరతాబాద్ స్టేషన్లో 40 వేల మంది రైలు దిగగా.. 22 వేల మంది రైలు ఎక్కారు. గతంలో కరోనా కంటే ముందు మెట్రోలో 4 లక్షల ప్రయాణికులు సరాసరిగా రోజున ప్రయాణించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: