ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

jobs ఉద్యోగాల పేరిట మోసం! - Cheated students

Cheating in the name of campus interview కళాశాల క్యాంపస్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. అందులో కొందరిని ఎంపిక చేసి.. ఉద్యోగానికి ఎంపికైనట్లు లేఖలు పంపించారు. మూడు నెలల తర్ఫీదు ఉంటుందని ఆ తర్వాత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రూ.50 వేలపైన చెల్లించాలని సూచించారు. అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ.10వేలు చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఒక్కసారి శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.2.64 లక్షలు ఉంటుందని విద్యార్థులను నమ్మబలికారు. రెండు నెలలు గడుస్తున్నా శిక్షణకు సంబంధించి ఉపకార వేతనం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అక్కడి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పలేదని బాధితులు వాపోతున్నారు.

Cheating in the name of campus interview
ఉద్యోగాల పేరిట మోసం!

By

Published : Sep 7, 2022, 8:35 AM IST

కళాశాల క్యాంపస్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. అందులో కొందరిని ఎంపిక చేసి.. ఉద్యోగానికి ఎంపికైనట్లు లేఖలు పంపించారు. మూడు నెలల తర్ఫీదు ఉంటుందని ఆ తర్వాత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రూ.50 వేలపైన చెల్లించాలని సూచించారు. దీంతో చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడిన విద్యార్థులకు అడియాశలే మిగిలాయి. చెన్నైకు చెందిన ఆస్ట్రిన్‌ ఇంటర్నేషనల్‌ ఏవియేషన్‌ అనే సంస్థ పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీటెక్‌, ఎంబీఏ చదువుతున్న వందలాది మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆపై అభ్యర్థులకు ఆఫర్‌ లేఖలు అందించారు.

వసూళ్ల పర్వమిలా..
అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ.10వేలు చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఒక్కసారి శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.2.64 లక్షలు ఉంటుందని విద్యార్థులను నమ్మబలికారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి వివిధ విమానాశ్రయాల్లో ఉద్యోగం కల్పిస్తామంటూ ఆఫర్‌ లేఖలో స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగా రూ.50 వేలు చెల్లించాలని, ఇవి తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ మాత్రమేనంటూ విద్యార్థులకు తెలియజేశారు. చదువు పూర్తయ్యే సమయానికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ పేరుతో డీడీలు తీసి సొమ్ము చెల్లించారు.

శిక్షణ సమయంలో తేటతెల్లం..
కొందరిని చెన్నైలో శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానించగా.. అక్కడికి వెళ్లిన వారికి అనుమానం వచ్చింది. గతేడాది ఇదే తరహాలో మోసపోయిన వారు సంస్థ ఉద్యోగులను ప్రశ్నిస్తుండటం.. రెండు నెలలు గడుస్తున్నా శిక్షణకు సంబంధించి ఉపకార వేతనం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అక్కడి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పలేదని బాధితులు వాపోతున్నారు.

నాలుగైదు జిల్లాల్లో బాధితులు..
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా కడప, కర్నూలు, అనంతపురం, కాకినాడ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇదే విధంగా మోసపోయారు. ఉద్యోగం వస్తుందన్న ఆనందంలో కొందరి తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంస్థ తమను పట్టించుకోవడం లేదని, కనీసం సొమ్ము ఇవ్వాలని కోరినా స్పందించట్లేదని బాధిత విద్యార్థులు కన్నీంటిపర్యంతమవుతున్నారు.ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details