ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దర్శనానికి వచ్చిన భక్తుడిపై ఆలయ పూజారి దాడి... ఎందుకో తెలుసా.? - సికింద్రాబాద్‌లో దర్శనానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడి

Priest attack on a devotee: దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడికి దిగాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగింది. బాధితుడి గోపాలపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Priest attack on a devotee
Priest attack on a devotee

By

Published : Mar 6, 2022, 4:59 PM IST

Priest attack on a devotee: గత రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని గణేష్ దేవాలయ దర్శనం కోసం ఉప్పల్ బాలాజీహిల్స్‌కు చెందిన వాల్మీకిరావు వచ్చారు. ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా ఆ గుడి లోపలికి ఎలా వెళ్తావని పూజారి ప్రభాకర్ శర్మకు, భక్తుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

దాడి చేయడమే కాకుండా..

అదే సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన పూజారి వాల్మీకిరావుపై విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశాడు. ఒక్కసారిగా అర్చకుడు ప్రభాకర్ శర్మ దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి చేయడమే కాకుండా భక్తుడిని బెదిరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వెంటనే వాల్మీకిరావు గోపాలపురం పీఎస్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

దర్శనానికి వచ్చిన భక్తుడిపై ఆలయ పూజారి దాడి... ఎందుకో తెలుసా.?

దేవాదాయశాఖ కమిషనర్‌ దృష్టికి..

ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన తనపై రౌడీల మాదిరిగా పూజారి దాడికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా దాడికి పాల్పడ్డ ఆలయ పండితుడు ప్రభాకర్‌శర్మపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను కోరారు. దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పూజారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామని దేవాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అతనికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఉక్రెయిన్ నుంచి క్రమక్రమంగా సొంతూళ్ళకు చేరుకుంటున్న విద్యార్థులు... ఆనందంలో ఆత్మీయులు

ABOUT THE AUTHOR

...view details