వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కుట్ర కోణం ఉందని...దానిని ఛేదించాలంటే మరింత లోతుగా దర్యాప్తు చేయాలని...అందుకు ఇంకా సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. కేసు విచారణ కోసం సీబీఐకి మరో 2నెలల గడువు ఇచ్చింది హైకోర్టు. నవంబరు 11న నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు16కు వాయిదా వేస్తూ...హైకోర్టు తీర్పునిచ్చింది. విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ - ap high court news
విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో కుట్రకోణం ఉందని...దర్యాప్తుకు ఇంకా సమయం కావాలని సీబీఐ హైకోర్టును కోరింది. దీంతో మరో 2 నెలల గడువు ఇస్తూ...విచారణ నవంబరు 16కు వాయిదా వేసింది హైకోర్టు.

వైద్యుడు సుధాకర్ కేసు హైకోర్టులో విచారణ