కరోనా ప్రబలుతున్న వేళ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా అనుమానితులను క్వారంటైన్ సెల్లో ఉంచుతున్నారు. క్వారంటైన్ అంటే.. వారిని నిర్భందిస్తున్నారా అనే అనుమానం రావొచ్చు. జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి క్వారంటైన్ సెల్లో ఉంటూ అక్కడి పరిస్థితిని వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ వీడియో చూస్తే క్వారంటైన్ సెల్‌పై మీకు ఉండే సందేహాలు తొలగిపోతాయి.
క్వారంటైన్ సెల్లో వారిని చాలా బాగా చూసుకుంటున్నారని.. ఒక్కొక్కరికీ ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారని ఆ వీడియోలో తెలిపారు. వారికి పెట్టే భోజనం ఎంతో బాగుటుందన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, డాక్టర్లు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని.. ఇలాంటి సౌకర్యాలు జర్మనీలోనూ చూడలేదని ఆ వ్యక్తి మెచ్చుకున్నాడు. తమని ఇంతబాగా చూసుకుంటున్నందుకు.. ప్రధాని, ఆరోగ్యమంత్రి, పోలీసులు, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.