తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ జలపాతం వద్ద చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బుర్ర సాయివంశీ(24)గా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ: చెక్‌డ్యామ్‌లో పడి... కృష్ణా జిల్లా యువకుడు మృతి - రంగారెడ్డి జిల్లాలో విషాదం
చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో జరిగింది. మృతుడు కృష్ణా జిల్లాకు చెందిన సాయివంశీ(24)గా గుర్తించారు. బోడకొండ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు మృతి
ఈ ఘటనపై మంచాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా మరేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:KRISHNA RIVER: కృష్ణా నదిలో యువకుల గల్లంతు... ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు