Insane Woman: మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది. దానితో వండిన కూరను తాను తినటమే కాక భర్తకు, కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్తకూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై తెలంగాణలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు.
పురుగుల మందునే వంటనూనెగా భావించిన మతిస్థిమితం లేని మహిళ - మతిస్థిమితం లేని మహిళ తాజా వార్తలు
Insane Woman ఆ మహిళకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆమె వంట చేసేందుకు పురుగుల మందునే మంచినూనెగా భావించి దానితో కూరను వండింది. ఆ కూరను తాను తినటమే కాక భర్తకు కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ ఘటన తెలంగాణ ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
మేడిదపల్లికి చెందిన బండ్ల నాగమ్మ(37) మతిస్థిమితం లేక ఇబ్బందిపడుతోంది. గురువారం ఉదయం ఇంట్లో మంచినూనెకు బదులుగా పక్కనున్న పురుగుమందుతో కూర వండింది. అనంతరం కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నాన్ని తిన్నాడు. మందువాసన రావటంతో కుమార్తె అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది.
ఇవీ చదవండి:Iron locker ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి బయటపడ్డ ఐరన్ లాకర్