తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఇద్దరు పిల్లలతో కలిసి శివసాగర్ చెరువులో దూకింది. ఘటనలో చిన్నారి మృతి చెందగా... తల్లి పరిస్థితి విషమంగా మారింది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లిపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మికి బంట్వారం మండల కేంద్రానికి చెందిన గోపాల్‌తో 2016లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. ఆమె బీఎస్సీ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తోంది. మధ్యాహ్నం భాగ్యలక్ష్మి తన ఫోన్లో తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్టేటస్ పెట్టింది. అది చూసిన కుటుంబ సభ్యులు, మిత్రులు వెతుకుతుండగా.. శివారెడ్డి పేట వైపు పిల్లలతో కలిసి వెళ్లిందని తెలుసుకున్నారు. శివారెడ్డి పేట చెరువు వద్ద పిల్లలతో కలిసి ఆమె ఉంది. అక్కడికి చేకురనేలోగానే చెరువులో దూకింది.
వెంటనే బంధువులు చెరువులో దూకి భాగ్యలక్ష్మి, చిన్న పాపను బయటకు తీశారు. అప్పటికే చిన్న పాపా మృతి చెందింది. తల్లి భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెద్ద పాపా కోసం చెరువులో గాలిస్తున్నారు. ఉద్యోగం లేక భర్త గోపాల్ డబ్బులు కోసం వేధించే వాడని భాగ్యలక్ష్మి తండ్రి తెలిపారు. రెండు మూడు రోజులు కిందట వారింటికి పోయి చిన్న పాపాకు కమ్మలు ఇప్పించినట్లు ఆయన తెలిపారు.