Rape: అమ్మతో గొడవపడి అమ్మమ్మ ఇంటికి వెళుతూ దారితప్పిన ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషను పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతంలో బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది... చాంద్రాయణగుట్ట గుల్షన్-ఎ-ఎక్బాల్ కాలనీకి చెందిన బాలిక(14) ఈనెల 18న చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌కాలనీలో తన అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది. అక్కడికి చేరుకోకపోవడం, బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు.. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. 19వ తేదీ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన బాలిక.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.