తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని వడ్డేపల్లికి చెందిన 13 ఏళ్ల బాలికపై.. ఉద్యోగ విరమణ పొందిన వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఈ కామాంధుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
Rape on girl: మాజీ ఉన్నతాధికారి దారుణం.. బాలికపై అత్యాచారం! - బాలికపై అత్యాచారం
కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు బాలికపై పశువులా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు చెప్పే ఉద్యోగంలో పనిచేసిన మానవ మృగం.. అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఉన్నత విద్యాశాఖ అధికారిగా పనిచేసిన భిక్షపతి అనే వృద్ధుడు.. ఉద్యోగ విరమణ పొందాడు. దీంతో.. ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో.. పక్కింట్లో నివాసముంటున్న బాలికపై కన్నేసిన నిందితుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను లోబర్చుకున్నాడు. తాజాగా.. మరోసారి బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా.. బాధితురాలి పెద్దమ్మ గుర్తించి కేకలు వేసింది. దీంతో.. స్థానికులంతా కలిసి నిందితుడికి దేహశుద్ది చేసి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి, కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:suicide attempt: కడపలో డిప్యూటీ జైలర్ ఆత్మహత్యాయత్నం