జీవితంపై విరక్తిచెంది ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటుచేసుకుంది. బానోతు అరుణ్ కుమార్ (30) సెంటినరీ కాలనీలో నివాసం ఉంటూ.. జనరల్ మజ్దూర్‌గా ఏయల్‌పీ మైన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 2017లో ఆయనకు కృష్ణవేణితో వివాహం జరిగింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత ఎప్రిల్ నెలలో భార్య తన పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి అరుణ్ తనలో తాను బాధపడుతూ జీవితం మీద విరక్తి చెందాడు. వెంట్రుకలకు వేసుకునే మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి తల్లి సాల్కు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
తెలంగాణ: భార్య వెళ్లిపోయిందని మనస్తాపం.. సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య - పెద్దపల్లి జిల్లా వార్తలు
జీవితంపై విరక్తిచెంది ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో చోటుచేసుకుంది. వెంట్రుకలకు వేసుకునే మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడంతో.. కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
తెలంగాణ: భార్య వెళ్లిపోయిందని మనస్థాపం.. సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య